News August 20, 2024
ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ: మంత్రి డోలా
AP: సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలలో చదువుతున్న వారికి ప్రతి నెలా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని మంత్రి డోలా వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్టల్‌లో 6 CC కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. SC అభ్యర్థులకు ఉచితంగా DSC శిక్షణ అందిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలలపాటు ఈ ట్రైనింగ్ కొనసాగుతుందన్నారు. 16,347 పోస్టులతో మెగా DSC నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Similar News
News September 19, 2024
పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త
AP: అర్హులకు పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలోనే సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెర్ప్‌పై CM చంద్రబాబుతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడారు. ‘పెన్షన్లు అందని వారికి పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే అంశంపై చర్చించాం. 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 15 లక్షల మంది ఉన్నారు. త్వరలోనే వారికి పెన్షన్లు ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తాం’ అని మంత్రి చెప్పారు.
News September 19, 2024
ఒక్క టెస్టూ ఆడకుండా 100 వన్డేలు ఆడేశాడు
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒక్క టెస్టు కూడా ఆడకుండానే 100 వన్డేలు ఆడిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించారు. ఈ ఫీట్ సాధించిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కారు. కాగా జంపా ఇప్పటివరకు 100 వన్డేల్లో 170 వికెట్లు, 92 టీ20ల్లో 111 వికెట్లు తీశారు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే యాషెస్ సిరీస్‌కు ఆయన ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
News September 19, 2024
కొత్త బుల్లెట్ వేరియెంట్ తీసుకొచ్చిన ఎన్‌ఫీల్డ్
బెటాలియన్ బ్లాక్ పేరిట రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లో కొత్త వేరియెంట్‌ను తీసుకొచ్చింది. గోల్డ్ పిన్ స్ట్రైపింగ్, బెంచ్ సీట్, పెద్ద సైజు నేమ్ బ్యాడ్జిలతో వింటేజ్ బుల్లెట్‌ను గుర్తుచేసేలా దీన్ని డిజైన్ చేసింది. 349సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ముందు 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు 153 ఎంఎం డ్రమ్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తోంది. ధర రూ.1.75 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూమ్).