News August 20, 2024
లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం యూటర్న్
లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రైవేటు రంగం నుంచి 45 మంది కార్యదర్శుల నియామకాలకు జారీ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీకి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలపై ప్రతిపక్షాలతో సహా మిత్రపక్షమైన ఎల్జేపీ వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 15, 2025
గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఈరోజు ఉదయం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు.
News January 15, 2025
మంత్రి లోకేశ్‌ను కలిసిన మంచు మనోజ్
AP: నారావారిపల్లెలో హీరో మంచు మనోజ్ మంత్రి లోకేశ్‌ను కలిశారు. మనోజ్ ఇవాళ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. దీంతో మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లెకు వెళ్లి లోకేశ్‌తో భేటీ అయ్యారు. వారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
News January 15, 2025
రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడు: బీసీసీఐ వర్గాలు
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్స్ ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ నిజంగానే పాక్‌కు వెళ్తే ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్VSపాక్ మ్యాచ్ 23న దుబాయిలో జరగనుంది.