News August 21, 2024
రైల్వే ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్

ఓవర్ టైం సదుపాయం వినియోగంలో ఉద్యోగులు, సిబ్బంది అవకతవకలను అరికట్టడంపై రైల్వే బోర్డు ఫోకస్ పెట్టింది. అన్ని రైల్వే స్టేషన్లలో సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు యంత్రాలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 17 రైల్వే జోన్ల GMలను ఆదేశించింది. రైల్వే విజిలెన్స్ డైరెక్టరేట్ చేసిన సిఫార్సుల మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News January 22, 2026
భర్తను చంపి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..

AP: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. డెడ్‌బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసింది. గుంటూరు దుగ్గిరాల (M)కు చెందిన శివనాగరాజుకి భార్య లక్ష్మీమాధురి బిర్యానీలో 20 నిద్రమాత్రల పొడి కలిపి పెట్టింది. భర్త స్పృహ కోల్పోయాక ప్రియుడు గోపితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింది. చెవిలో రక్తం కనిపించడంతో పోలీసులు అసలు విషయం బయటకు లాగారు.
News January 22, 2026
నేడు అందుబాటులోకి కళ్యాణోత్సవం టికెట్లు

AP: తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది. వీటితోపాటు వర్చువల్ సేవ టికెట్లను కూడా రిలీజ్ చేస్తోంది. 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు, 24న (అకామిడేషన్) రూమ్స్, రూ.300 దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. భక్తులు అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
News January 22, 2026
సరస్వతీ దేవి అనుగ్రహం కోసం రేపేం చేయాలంటే

అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు పసుపు దుస్తులు ధరించాలి. పూజలో తెల్లని పూలు, గంధం సమర్పించి ‘ఓం ఐం సరస్వత్యై నమః’ మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా చక్కెర పొంగలి, కేసరి, పులిహోరను సమర్పించాలి. పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నులవుతారు. పూజా సమయంలో పుస్తకాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రార్థించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పురాణ వచనం.


