News August 21, 2024

రైల్వే ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్

image

ఓవర్ టైం సదుపాయం వినియోగంలో ఉద్యోగులు, సిబ్బంది అవకతవకలను అరికట్టడంపై రైల్వే బోర్డు ఫోకస్ పెట్టింది. అన్ని రైల్వే స్టేషన్లలో సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు యంత్రాలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 17 రైల్వే జోన్ల GMలను ఆదేశించింది. రైల్వే విజిలెన్స్ డైరెక్టరేట్ చేసిన సిఫార్సుల మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News September 20, 2024

స్థానికత విషయంలో నీట్ విద్యార్థులకు ఊరట

image

TG: స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్థానికత వ్యవహారంపై HC తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారి ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టుకు వివరించింది. స్థానికతను నిర్ధారిస్తూ తీర్పులున్నా ఆ విద్యార్థులు HCని ఆశ్రయించారంది.

News September 20, 2024

నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్

image

లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News September 20, 2024

లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు: ఏఆర్ డెయిరీ

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.