News August 21, 2024
హైడ్రా కూల్చివేతల తీరుపై హైకోర్టు ప్రశ్నలు
TG: అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా పరిధిపై <<13906009>>హైకోర్టు<<>> ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని విధివిధానాలు చెప్పాలని AAGని ఆదేశించింది. ఇదొక ఇండిపెండెంట్ బాడీ అని, చెరువుల పరిరక్షణ కోసమే ఏర్పాటైందని AAG కోర్టుకు వివరించారు. స్థానిక సంస్థల అనుమతితో చేపట్టిన నిర్మాణాలు అక్రమమని 15-20 ఏళ్ల తర్వాత కూల్చేస్తే ఎలా అంటూ.. తదుపరి విచారణను కోర్టు మ.2.15కు వాయిదా వేసింది.
Similar News
News January 24, 2025
భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటో భారత పర్యటనకు వచ్చారు. 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని భారత్ ఆహ్వానించగా, ఆయన కొద్దిసేపటి కిందటే ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడి రాక రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.
News January 24, 2025
ట్రంప్ ఆర్డర్ నిలిపివేత.. ఎన్ని రోజులంటే?
వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ <<15240441>>హక్కు<<>>ను రద్దు చేసిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సియాటెల్ జడ్జి ఆదేశాల ప్రకారం ఆ ఆర్డర్ దేశ వ్యాప్తంగా 14 రోజుల పాటు అమలు కాదు. అలాగే, విచారణ సమయంలో జడ్జి మాట్లాడుతూ ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధమైందని బార్‌లోని సభ్యుడు నిస్సందేహంగా ఎలా చెప్పగలరో అర్థం కావడం లేదన్నారు. ఇది తన మనసును కలవరపెడుతోందని చెప్పారు.
News January 24, 2025
భారత భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ: బ్రాడ్ హగ్
భారత T20 జట్టుకు భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నారు. అతని బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. తిలక్ వర్మ స్మార్ట్ క్రికెటర్ అని, అతని క్రికెట్ బ్రెయిన్ సూపర్ అన్నారు. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతారని తెలిపారు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌పై T20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తిలక్ ఇప్పటి వరకు 21మ్యాచులు ఆడి 635 రన్స్ చేశారు.