News January 24, 2025
భారత భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ: బ్రాడ్ హగ్

భారత T20 జట్టుకు భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నారు. అతని బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. తిలక్ వర్మ స్మార్ట్ క్రికెటర్ అని, అతని క్రికెట్ బ్రెయిన్ సూపర్ అన్నారు. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతారని తెలిపారు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌పై T20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తిలక్ ఇప్పటి వరకు 21మ్యాచులు ఆడి 635 రన్స్ చేశారు.
Similar News
News November 10, 2025
బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతామని CM హిమంత బిస్వ శర్మ తెలిపారు. దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.
News November 10, 2025
నవంబర్ 10: చరిత్రలో ఈరోజు

1798: తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం
1848: జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ జననం
1904: బహురూపధారణ(డ్యుయల్ రోల్) ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు వైద్యుల చంద్రశేఖరం జననం
1979: స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం (ఫొటోలో)
1993: కథా రచయిత రావిశాస్త్రి మరణం
* ప్రపంచ సైన్స్ దినోత్సవం
News November 10, 2025
బిహార్: 122 స్థానాల్లో 1,302 మంది బరిలోకి

బిహార్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్ జరగనుండగా సుమారు 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 136 మంది మహిళలు కావడం గమనార్హం. 45,399 కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ 122 స్థానాల్లో బీజేపీ 42, ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది.


