News August 22, 2024

నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

image

AP: వర్షాభావ పరిస్థితులతో తిరుమలలో డ్యాంలు ఎండిపోతున్నాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది. రిజర్వాయర్లలో 130 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వ ఉందని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నీటి వృథాను నివారించాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో రోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు.

Similar News

News January 24, 2025

సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.

News January 24, 2025

తలకు ఆనుకొని భారీ కణితి.. కాపాడిన వైద్యులు

image

ఫొటో చూసి రెండు తలలతో ఉన్న శిశువు అనుకుంటున్నారా? కాదు. ఈ పాపకు తలతో పాటు భారీ కణితి ఏర్పడింది. దీనిని ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే డిసీస్ అని ఓ వైద్యుడు ఈ ఫొటో షేర్ చేశారు. పుట్టుకతోనే మెదడుతో పాటు చుట్టుపక్కల కణజాలం పుర్రె నుంచి బయటకు వస్తాయని తెలిపారు. ఎంతో క్లిష్టమైన చికిత్సను తాము పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల వీటిని ముందే గుర్తించవచ్చన్నారు.

News January 24, 2025

400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యం!

image

యూపీ సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేల్లో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ అస్థిపంజరం బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్మారక ప్రదేశం 1920 నుంచి ASI రక్షణలో ఉంది.