News August 22, 2024

మీ చేతగానితనాన్ని జగన్‌పై నెట్టొద్దు చంద్రబాబూ: YCP

image

AP: YS జగన్ వల్లే ఎసెన్షియా ఫార్మా ప్రమాదం జరిగిందని <<13914396>>ఆరోపించిన<<>> టీడీపీపై వైసీపీ మండిపడింది. ‘ప్రమాదం తర్వాత చర్యలు తీసుకోకుండా చంద్రబాబు తెల్లముఖం వేస్తున్నారు. మీ చేతగానితనాన్ని జగన్‌పై నెట్టే దిక్కుమాలిన ప్రయత్నాలు మానుకోండి. పరిశ్రమల కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించింది జగనే. కంపెనీల్లో భద్రతపై చంద్రబాబు ఏనాడైనా సమీక్షించారా?’ అని Xలో నిలదీసింది.

Similar News

News February 13, 2025

సీఎం రేవంత్‌ను గద్దె దించే ప్రయత్నం.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

image

TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని కోసం 25 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. మరోవైపు ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

News February 13, 2025

గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

image

APలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ OTPR ID, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 13, 2025

మంత్రి సురేఖపై పరువునష్టం దావా.. విచారణ 27కు వాయిదా

image

TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సురేఖ ఇప్పటికే క్షమాపణ చెప్పారని ఆమె తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన విమర్శలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేదని నాగార్జున తరఫు లాయర్ పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

error: Content is protected !!