News February 13, 2025
గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

APలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ OTPR ID, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <
Similar News
News March 26, 2025
శ్రేయస్ అయ్యర్.. కమ్‌బ్యాక్ సూపర్!

నిన్నటి IPL మ్యాచ్‌లో ప్లేయర్‌గా(97 రన్స్), కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్‌ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్‌బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
News March 26, 2025
ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.
News March 26, 2025
మెగాస్టార్-అనిల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిని వినోదభరితమైన చిత్రంగా రూపొందిస్తారని పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా, మే 9న విడుదల కానుంది. ఇక అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.