News August 22, 2024
పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ డైరెక్టర్, ప్రొడ్యూసర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Similar News
News March 29, 2026
IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.
News March 29, 2026
మరో 2 రోజులే గడువు!

దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర మంత్రి అమిత్ షా విధించిన గడవు మరో 2 రోజుల్లో(మార్చి 31) ముగుస్తోంది. ఆపరేషన్ కగార్‌తో వందల మంది నేలకొరగగా, ఇంకెంతో మంది లొంగిపోయారు, లొంగిపోతున్నారు. ఇందులో తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి, మల్లోజుల, పాపారావు వంటి అగ్ర నేతలు ఉన్నారు. అయితే కీలక నేత గణపతి ఇంకా సరెండర్ కాలేదు. ఆయన నేపాల్‌లో ఉన్నారని ఈ నెల 31న లొంగిపోతారని వార్తలు వస్తున్నాయి.
News March 29, 2026
OTTలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. డేట్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17 లేదా 24వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈనెల 19న థియేటర్లలో విడుదలైంది.


