News August 23, 2024
పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లతో పీఎం భేటీ
పోలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి కబడ్డీ స్టార్స్‌తో తాజాగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన తెలిపారు. ‘వార్సాలో పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లు మికల్ స్పిజ్కో, అన్నా కల్బర్క్‌జిక్‌లను కలిశాను. ఆ ఆటను ఇక్కడి వారు చాలా ఇష్టపడుతుంటారు. పోలాండ్‌లో దాన్ని మరింతగా విస్తృతపరచడంపై, భారత్‌తో మరిన్ని టోర్నీలు ఆడటంపై వారితో చర్చించాను’ అని పీఎం వెల్లడించారు.
Similar News
News January 25, 2025
దక్షిణ జార్జియాను ఢీకొట్టనున్న భారీ ఐస్‌బర్గ్!
అంటార్కిటికా నుంచి విడిపోయిన ఓ భారీ మంచుకొండ(A23a) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకెళ్తోంది. ఇది మున్ముందు దక్షిణ జార్జియా ద్వీపాన్ని ఢీకొనే అవకాశముంది. ఆ ప్రాంతానికి 280KM దూరంలో ఉన్న ఈ ఐస్‌బర్గ్ బలమైన గాలులు, సముద్ర ప్రవాహాల వల్ల వేగంగా కదులుతోంది. 4K చ.కి.మీ. వైశాల్యం ఉండే మంచుకొండ ఆ ద్వీపాన్ని ఢీకొట్టి అక్కడే చిక్కుకునే ప్రమాదముంది. దీంతో అందులోని పెంగ్విన్లు, సీల్స్‌కు ఆహారం దొరకడం కష్టమవుతుంది.
News January 25, 2025
నేడు షమీ ఆడతారా?
భారత స్టార్ బౌలర్ షమీ నేడు ఇంగ్లండ్‌తో జరిగే 2వ T20 ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న షమీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశారు. అయితే మోకాలికి బ్యాండేజ్ వేసి ఉండటంతో మ్యాచ్ ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి T20 ఆడతారని భావించినా డగౌట్‌కే పరిమితమయ్యారు. అటు షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం షమీ ఆడాలని కోరుకుంటున్నారు.
News January 25, 2025
వ్యాయామం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదముంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి % తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్‌గా ఉన్నామా? లేదా? తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం బెటర్. శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడకూడదు. కడుపునిండా భోజనం చేసి ఎక్సర్‌సైజ్ చేయకూడదు.