News August 23, 2024

అచ్యుతాపురం ప్రమాదంపై NGT సుమోటో విచారణ

image

AP: అచ్యుతాపురం సెజ్‌లో మొన్న జరిగిన ప్రమాద ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారించనుంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించడంతో పాటు 60 మందికి పైగా గాయపడినట్లు వచ్చిన వార్తల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, ఎసెన్షియా కంపెనీకి NGT నోటీసులు ఇచ్చింది.

Similar News

News January 15, 2025

మంత్రి లోకేశ్‌ను కలిసిన మంచు మనోజ్

image

AP: నారావారిపల్లెలో హీరో మంచు మనోజ్ మంత్రి లోకేశ్‌ను కలిశారు. మనోజ్ ఇవాళ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. దీంతో మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లెకు వెళ్లి లోకేశ్‌తో భేటీ అయ్యారు. వారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు.

News January 15, 2025

రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడు: బీసీసీఐ వర్గాలు

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్స్ ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ నిజంగానే పాక్‌కు వెళ్తే ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్VSపాక్ మ్యాచ్ 23న దుబాయిలో జరగనుంది.

News January 15, 2025

ఇందిరా భవన్‌కు కాదు లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతాం: కాంగ్రెస్

image

ఢిల్లీలోని తమ కొత్త హెడాఫీసుకు ఇందిరా భవన్ పేరునే కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా పేరుమార్చి ఆయన్ను గౌరవించాలని <<15160758>>BJP<<>> అడగటంపై స్పందించింది. ఇందిరా భవన్‌లోని లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతామని ప్రకటించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి కొత్త ఆఫీసును బుధవారం ఆరంభించిన సంగతి తెలిసిందే.