News August 23, 2024
అచ్యుతాపురం ప్రమాదంపై NGT సుమోటో విచారణ
AP: అచ్యుతాపురం సెజ్‌లో మొన్న జరిగిన ప్రమాద ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారించనుంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించడంతో పాటు 60 మందికి పైగా గాయపడినట్లు వచ్చిన వార్తల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, ఎసెన్షియా కంపెనీకి NGT నోటీసులు ఇచ్చింది.
Similar News
News September 19, 2024
విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన
TG: ప్రస్తుతం ఇళ్లకు 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ₹10 నుంచి ₹50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరీలో 20%లోపే ప్రజలు ఉన్నందున అంతగా ప్రభావం పడదని అంచనా. పరిశ్రమలకు సంబంధించి 11KVకి యూనిట్‌కు ₹7.65, 33KVకి ₹7.15, 132KVకి ₹6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు ₹7.65చొప్పున వసూలుకు అనుమతించాలని కోరాయి.
News September 19, 2024
లంచ్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను యశస్వి, పంత్ ఆదుకున్నారు. లంచ్ విరామం వరకు వికెట్ కోల్పోకుండా నియంత్రణతో ఆడారు. భారత జట్టు 23 ఓవర్లలో 88 పరుగులు చేయగా యశస్వి(37), పంత్(33) క్రీజులో ఉన్నారు.
News September 19, 2024
గూఢచార సంస్థ మొస్సాద్ గురించి ఈ విషయాలు తెలుసా?
హెజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కి ఘన చరిత్రే ఉంది. 1976లో ఉగాండాలో 102 మంది బందీల విడుదలకు ఆపరేషన్ ఎంటెబ్బా చేపట్టింది. తమ అథ్లెట్లను హత్య చేసిన వారిని వివిధ దేశాల్లో వెంటాడి చంపింది. ఐచ్మాన్, ఒపేరా, మొసెస్, డైమండ్, ప్లంబట్, సబేనా వంటి అనేక ఆపరేషన్లు చేపట్టింది. శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ మొస్సాద్ బలం.