News August 23, 2024

18 ఏళ్లు నిండే వారికి అలర్ట్

image

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 JAN 1 వరకు 18 ఏళ్లు నిండే వారు ఓటర్ల జాబితాలో పేరు <>నమోదు<<>> చేసుకోవచ్చు. OCT 10 వరకు BLOలు ఇంటింటి సర్వే, జాబితాలో ఫొటోల మార్పు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపడతారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలతో OCT 29న ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, DEC 24 నాటికి పరిష్కరించి JAN 6న తుది జాబితా ప్రకటిస్తారు.

Similar News

News January 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఆర్థిక పరిస్థితి పుంజుకున్నాకే పథకాలు: ఏపీ సీఎం చంద్రబాబు
* ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంపు: మంత్రి అనగాని
* ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చెప్పేవి పచ్చి అబద్ధాలు: అంబటి
* రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నాలను అడ్డుకుంటాం: సీఎం రేవంత్
* గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్
* ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా బుమ్రా

News January 28, 2025

బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్

image

TG: గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

News January 28, 2025

నిద్రపోయే ముందు ఇలా చేయట్లేదా?

image

శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండాలంటే తగినంత నీరు అవసరం. రోజును గ్లాసు నీళ్లతో ప్రారంభించడమే కాకుండా నిద్ర పోయే ముందూ గ్లాసు నీరు తాగడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుందంటున్నారు. అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.