News January 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఆర్థిక పరిస్థితి పుంజుకున్నాకే పథకాలు: ఏపీ సీఎం చంద్రబాబు
* ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంపు: మంత్రి అనగాని
* ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చెప్పేవి పచ్చి అబద్ధాలు: అంబటి
* రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నాలను అడ్డుకుంటాం: సీఎం రేవంత్
* గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్
* ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా బుమ్రా

Similar News

News February 16, 2025

న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

image

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

News February 16, 2025

రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం: జగ్గారెడ్డి

image

TG: రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బదులిచ్చారు. రాహుల్‌ది బ్రాహ్మణ కుటుంబమని, వారు హిందువులని పేర్కొన్నారు. సోనియాను ఉద్దేశించి హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకు వస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చేసే విమర్శల్లో కొన్నయినా వాస్తవాలు ఉండాలని హితవు పలికారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పని చేసిందని తెలిపారు.

News February 16, 2025

ఆ లోపే బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక: కిషన్ రెడ్డి

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.

error: Content is protected !!