News August 23, 2024

అచ్యుతాపురం సెజ్ ఘటన.. డీజీపీ, సీఎస్‌కు NHRC నోటీసులు

image

AP: అచ్యుతాపురం సెజ్ <<13912550>>ఘటనను<<>> జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. డీజీపీ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్టును అడిగింది. గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీసింది.

Similar News

News March 7, 2026

కేయూలో రెండు రోజుల జాతీయ సదస్సు

image

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, కాకతీయ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ఈనెల 9, 10 తేదీలలో నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో “literature, leadership and innovation women shaping viksith bharat – 2047”, అనే అంశంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని సంచాలకులు డాక్టర్ బి.దీపా జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు,

News March 7, 2026

అమెరికాకు షాక్.. కీలక వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్!

image

అమెరికాకు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసింది. <<14350576>>థాడ్(THAAD)<<>>లో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టమ్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ సిస్టమ్ విలువ $300M(₹2,760Cr) పైనే. ప్రపంచంలో USకు 8 థాడ్ వ్యవస్థలున్నాయి.

News March 7, 2026

ఈ కలర్ క్లాత్స్‌తో సమ్మర్‌లో హాయ్ హాయ్..!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు కొన్ని రంగుల దుస్తులకు ప్రయారిటీ ఇస్తే శరీరం చల్లగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తెలుపు, లైట్ బ్లూ, లైట్ గ్రే, సాఫ్ట్ పింక్, పేల్ గ్రీన్, లావెండర్, పౌడర్ బ్లూ, క్రీమ్ తదితర రంగుల దుస్తులు వాడాలని సూచిస్తున్నారు. ఇవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసి తక్కువ వేడిని గ్రహిస్తాయి. అలాగే చెమటను త్వరగా ఆరేలా చేస్తాయి.