News August 23, 2024

అచ్యుతాపురం సెజ్ ఘటన.. డీజీపీ, సీఎస్‌కు NHRC నోటీసులు

image

AP: అచ్యుతాపురం సెజ్ <<13912550>>ఘటనను<<>> జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. డీజీపీ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్టును అడిగింది. గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీసింది.

Similar News

News January 13, 2026

మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

image

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.

News January 13, 2026

DRDOలో JRF పోస్టులు

image

బెంగళూరు <>DRDO <<>>పరిధిలోని సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్స్ సిస్టమ్ 10 JRF పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో BE/BTech, GATE స్కోరు గలవారు FEB 22 వరకు ఈ మెయిల్ jrf.rectt.cabs[at]gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.37000+HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in

News January 13, 2026

కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన మీనాక్షి

image

తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నటుడు, డాక్టర్ అవ్వకూడదని హీరోయిన్ మీనాక్షి చౌదరీ అన్నారు. అంతేకాకుండా మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి ఉండకూడదని తెలిపారు. ఎందుకంటే తాను ఇప్పటికే ఆ హోదాల్లో ఉన్నానని చెప్పారు. అయితే తన ఫేవరెట్ డిష్ రాజ్మా 100 ఎకరాల్లో పండించే వ్యక్తి కావాలని తెలిపారు. హైట్ ఉండటంతో పాటు కుకింగ్ తెలిసి ఉండాలన్నారు. కాగా ఆమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.