News August 24, 2024

యుద్ధ ఖైదీలను మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్

image

రష్యా- ఉక్రెయిన్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 6న రష్యా భూభాగంలో ఉక్రెయిన్ మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టాక తొలిసారి 2 దేశాలు 230 మంది యుద్ధ ఖైదీలను మార్పిడీ చేసుకున్నాయి. దీంతో చెరోవైపు 115 మంది సైనికులు తమ సొంత దేశాలకు వెళ్తారు. ఇందుకు UAE చొరవ తీసుకుంది. 2 దేశాల మధ్యవర్తిత్వం నెరిపింది. తమ జవాన్లు తిరిగొచ్చారని జెలెన్ స్కీ, తమ వాళ్లు బెలారస్‌లో ఉన్నారని రష్యా రక్షణశాఖ తెలిపింది.

Similar News

News February 8, 2026

జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

image

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

News February 8, 2026

కలర్ ఫుల్‌గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

image

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్‌లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కొత్త టేకింగ్‌తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.

News February 8, 2026

రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

image

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.