News August 24, 2024
యుద్ధ ఖైదీలను మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్
రష్యా- ఉక్రెయిన్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 6న రష్యా భూభాగంలో ఉక్రెయిన్ మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టాక తొలిసారి 2 దేశాలు 230 మంది యుద్ధ ఖైదీలను మార్పిడీ చేసుకున్నాయి. దీంతో చెరోవైపు 115 మంది సైనికులు తమ సొంత దేశాలకు వెళ్తారు. ఇందుకు UAE చొరవ తీసుకుంది. 2 దేశాల మధ్యవర్తిత్వం నెరిపింది. తమ జవాన్లు తిరిగొచ్చారని జెలెన్ స్కీ, తమ వాళ్లు బెలారస్‌లో ఉన్నారని రష్యా రక్షణశాఖ తెలిపింది.
Similar News
News September 17, 2024
వినాయక నిమజ్జనంలో ప్రమాదం
మహారాష్ట్రలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడికో వెళ్లగా.. మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. అది రివర్స్ వెళ్లి ప్రజలపైకి దూసుకెళ్లడంతో 13, 6, 3 ఏళ్ల పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి, అసలైన డ్రైవర్ పారిపోగా, పోలీసులు వెతికి పట్టుకున్నారు. ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
News September 17, 2024
మీ ఫోన్ చోరీకి గురికాకుండా ఇలా చేయండి
మీ ఫోన్ చోరీకి గురైనా కూడా దాని లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. Track it EVEN if it is off అనే యాప్‌ను నచ్చిన ప్లాన్‌తో సబ్‌స్క్రైబ్ చేసుకొని అందులో ‘యాంటీ థెఫ్ట్’ సెలక్ట్ చేసుకొని ఫేక్ షట్‌డౌన్ ఆన్ చేసుకోవాలి. ఫోన్ చోరీకి గురైనప్పుడు ఆగంతకులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాక డివైస్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ, ఫోన్ ఆన్‌లోనే ఉంటుంది. యాప్ వెబ్‌సైట్ ద్వారా ఫోన్ లోకేషన్‌ను ఈజీగా ట్రాక్ చేయవచ్చు.
News September 17, 2024
ఐదేళ్లూ YCP మాట్లాడలేదు.. ఇప్పుడు మాపై విమర్శలా: CM
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా సర్వవిధాలా ప్రయత్నిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘కేంద్రమంత్రులతో ఇప్పటికే మాట్లాడాను. ప్లాంట్‌కు కావాల్సిన నిధులు విడుదల చేయిస్తాం. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పని చేద్దాం. గతంలో స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీ వెళ్లి మాట్లాడుదాం రమ్మంటే జగన్ రాలేదు. ఐదేళ్లూ మాట్లాడని వైసీపీ ఇప్పుడు మాపై విమర్శలు చేస్తోంది’ అని ఫైర్ అయ్యారు.