News August 25, 2024
BSNLలోకి మారాలంటే ఇలా చేయండి!

మొబైల్ యూజర్ల చూపు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం ఆపరేటర్ BSNLవైపు మళ్లింది. దీంతో వారందరినీ తమ ఫ్యామిలీలో చేర్చుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. పెరిగిన రీఛార్జి ధరల నుంచి ఉపశమనం పొందేందుకు BSNLకు పోర్ట్ అవ్వాలని ప్రకటన విడుదల చేసింది. PORT<>Mobile Number టైప్ చేసి 1900కి మెసేజ్ పంపిస్తే పోర్ట్ అవుతుందని తెలిపింది. దగ్గర్లోని రిటైలర్స్ను సంప్రదించాలని పేర్కొంది.
Similar News
News November 12, 2025
స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<


