News August 25, 2024

BSNLలోకి మారాలంటే ఇలా చేయండి!

image

మొబైల్ యూజర్ల చూపు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం ఆపరేటర్ BSNLవైపు మళ్లింది. దీంతో వారందరినీ తమ ఫ్యామిలీలో చేర్చుకునేందుకు బీఎస్‌ఎన్ఎల్ సిద్ధమైంది. పెరిగిన రీఛార్జి ధరల నుంచి ఉపశమనం పొందేందుకు BSNLకు పోర్ట్ అవ్వాలని ప్రకటన విడుదల చేసింది. PORT<>Mobile Number టైప్ చేసి 1900కి మెసేజ్ పంపిస్తే పోర్ట్ అవుతుందని తెలిపింది. దగ్గర్లోని రిటైలర్స్‌ను సంప్రదించాలని పేర్కొంది.

Similar News

News September 16, 2024

హీరో దర్శన్ అంతకుముందు ఉన్న జైలులో ఫోన్లు, కత్తులు

image

హత్య కేసులో అరెస్టయిన సినీ హీరో దర్శన్‌కు VIP ట్రీట్‌మెంట్ ఇచ్చిన బెంగళూరు జైలులో పోలీసులు తాజాగా రైడ్ చేశారు. 15 ఫోన్లు, ₹1.3లక్షల విలువైన శామ్‌సంగ్ డివైస్, 7 ఎలక్ట్రిక్ స్టవ్‌లు, 5 కత్తులు, 3 ఫోన్ ఛార్జర్లు, పెన్ డ్రైవ్‌లు, ₹36,000 నగదు, సిగరెట్, బీడీ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. VIP ట్రీట్‌మెంట్ విషయం వివాదంగా మారడంతో దర్శన్‌ను బళ్లారి జిల్లా జైలుకు మార్చిన సంగతి తెలిసిందే.

News September 16, 2024

ట్రక్కు డ్రైవర్‌తో కూడా గంభీర్ గొడవపడ్డారు: చోప్రా

image

టీమ్ ఇండియా కోచ్ గంభీర్‌ గ్రౌండ్‌లోనే కాక ఎక్కడైనా గొడవకు రెడీగానే ఉంటారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపారు. ‘గంభీర్‌ చాలా త్వరగా సహనాన్ని కోల్పోతారు. ఢిల్లీలో ఓసారి ఓ ట్రక్కు డ్రైవర్ రాంగ్ రూట్‌లో వచ్చాడు. పైపెచ్చు గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. దీంతో కారు దిగి ట్రక్కు పైకి ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకుని గొడవపడ్డారు. తేడా వస్తే గంభీర్‌తో అలాగే ఉంటుంది’ అని వివరించారు.

News September 16, 2024

5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.160 పెరిగి రూ.75,050కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.150 పెరిగి రూ.68,800 పలుకుతోంది. గత 5 రోజుల్లో ధర ఏకంగా రూ.1750 పెరిగింది. ఇక వెండి ధర కేజీ మరో రూ.1,000 పెరిగి రూ.98వేలకు చేరింది. 5 రోజుల్లో వెండి ధర రూ.6,500 పెరగడం గమనార్హం.