News August 26, 2024
ఫార్మా ప్రమాదాలపై విచారణ జరపాలి: CPM

AP: ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఫ్యాక్టరీల్లో భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు దురదృష్టకరమని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన 119 ప్రమాదాల్లో 150 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాలపై నివేదికలు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News March 13, 2026
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19369095>>మరోసారి<<>> తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.1,60,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 పతనమై రూ.1,47,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది.
News March 13, 2026
RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
News March 13, 2026
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

AP: ఉగాది కానుకగా PM కిసాన్‌తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <


