News August 26, 2024

ఫార్మా ప్రమాదాలపై విచారణ జరపాలి: CPM

image

AP: ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఫ్యాక్టరీల్లో భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు దురదృష్టకరమని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన 119 ప్రమాదాల్లో 150 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాలపై నివేదికలు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News December 10, 2024

శబరిమల వెళ్లే మహిళలకు గుడ్‌న్యూస్

image

శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.

News December 10, 2024

మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా

image

AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.

News December 10, 2024

మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్

image

AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.