News August 26, 2024

IR, PRC ప్రకటించాలి: బొప్పరాజు

image

AP: ఉద్యోగులకు మధ్యంతర భృతి, 12వ PRCని ప్రకటించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ఏ కార్యాలయంలోనూ పాత రికార్డులకు భద్రత లేదు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో దోషులెవరో తేలలేదు. ఈ ఘటనలతో ఉద్యోగులు భయపడుతున్నారు. మాపై తప్పుడు అభిప్రాయానికి రావొద్దు. సీఐడీ విచారణ పూర్తయ్యాక నిర్ణయానికి వద్దాం’ అని విజయవాడలో మీడియా సమావేశంలో చెప్పారు.

Similar News

News March 20, 2026

గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

image

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.

News March 20, 2026

ఏప్రిల్ 1 నుంచి ఆ బ్యాంకుల ఏటీఎమ్ రూల్స్ ఛేంజ్!

image

ATM మనీ విత్‌డ్రాలపై HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోత విధించాయి. ఇప్పటివరకు సెపరేట్‌గా ఉన్న UPI విత్‌డ్రాల్స్‌ను రెగ్యూలర్ కార్డ్ విత్‌డ్రాల్‌తో HDFC కలిపేయనుంది. దీంతో ఫ్రీ లిమిట్ దాటితే ట్రాన్సాక్షన్‌కు ₹23 చొప్పున ఛార్జ్ పడుతుంది. ఇక PNB రూపే NCMC ప్లాటినమ్ డొమెస్టిక్ సహా పలు వేరియంట్లపై డైలీ విత్‌డ్రాల్ లిమిట్ ₹లక్ష నుంచి ₹50వేలుకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.

News March 20, 2026

కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు: భట్టి

image

TG: రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన 2 లక్షల మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. కాగా చేయూత స్కీమ్ కింద ప్రస్తుతం నెలకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల పెన్షన్ అందుతోంది.