News August 27, 2024
వారికి రుణమాఫీపై నేడు స్పష్టత!

TG: రాష్ట్రంలో ₹2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు చర్చించనున్నారు. రుణమాఫీ యాప్‌లో వివరాల నమోదు, ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.
Similar News
News March 19, 2026
ఉగాది పచ్చడి ఎందుకు తాగాలంటే?

ఉగాది పచ్చడి మానవ జీవితంలోని విభిన్న కోణాలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక సందేశం. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడిలో ప్రతి రుచి ఓ భావానికి ప్రతీక. తీపి ఆనందాన్ని, పులుపు నేర్పును, చేదు బాధను, వగరు సవాళ్లను, కారం క్రోధాన్ని, ఉప్పు ఉత్సాహాన్ని సూచిస్తాయి. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని, అన్ని అనుభవాల కలయికే పరిపూర్ణ జీవనమని బోధిస్తుంది. కొత్త ఏడాదిలో రాబోయే సవాళ్లను ఎదుర్కోవాలని సూచిస్తుంది.
News March 19, 2026
గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సిందే: SEC

AP: సర్పంచ్ ఎన్నికల కోసం పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా <<19333584>>ప్రచురణకు<<>> మరో 4 వారాలు గడువు పొడిగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని SEC నీలం సాహ్ని తిరస్కరించారు. ఇప్పటికే 13,351 పంచాయతీల్లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని ఆమె తెలిపారు. గడువు పెంపునకు సరైన కారణాలు లేవన్నారు. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా జాబితా ప్రచురణ ఆలస్యమైతే పరిశీలించి తగిన ఆదేశాలిస్తామని పేర్కొన్నారు.
News March 19, 2026
రూ.18 వేల కోట్లతో RCB కొనుగోలుకు డీల్!

IPL డిఫెండింగ్ ఛాంపియన్ RCB జట్టు అమ్మకం వ్యవహారం తుది దశకు చేరుకుంది. ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు మనిపాల్ గ్రూప్-US-సింగపూర్ సంస్థలతో కూడిన కన్సార్షియం, స్వీడన్‌కు చెందిన ‘ఈక్యూటీ(EQT)’ బరిలో నిలిచాయి. EQT కంపెనీ రూ.18,486 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ డీల్ ఖరారైతే IPLలో హయ్యెస్ట్ వాల్యూ ఫ్రాంచైజీగా, ప్రపంచంలోనే అత్యంత ధనిక జట్లలో ఒకటిగా RCB నిలవనుంది.


