News August 27, 2024

వారికి రుణమాఫీపై నేడు స్పష్టత!

image

TG: రాష్ట్రంలో ₹2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు చర్చించనున్నారు. రుణమాఫీ యాప్‌లో వివరాల నమోదు, ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.

Similar News

News February 12, 2026

సిరిసిల్ల: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

image

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. సిరిసిల్ల సినారె కళామందిరంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం సాయంత్రం ఇన్ ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. కౌంటింగ్ హాల్లో కలియ తిరుగుతూ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఒక్కో వార్డు ఫలితాలు ఒక్కో రౌండ్‌లో వెలువడేలా అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి 39 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.

News February 12, 2026

ఆగస్టు 21న నాని ‘ప్యారడైజ్’ విడుదల

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ప్యారడైజ్’ చిత్రం విడుదల వాయిదా పడింది. మార్చి 26న రావాల్సిన ఈ మూవీని ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నేను తొందరపడాలి అనుకోవట్లేదు. దీనికి నాకు కొంత సమయం కావాలి. 21-08-2026న ప్యారడైజ్ వస్తుంది’ అని పేర్కొంటూ శ్రీకాంత్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News February 12, 2026

జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

image

ప్రస్తుత కాలంలో కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వారానికోసారి హెయిర్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.