News August 27, 2024

హార్దిక్ పాండ్యతో విడాకుల తర్వాత ప్రేమపై నటాషా పోస్ట్

image

క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిక్ కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాలో ఉంటున్నారు. తాజాగా ఆమె ప్రేమ గురించి ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. లవ్‌లో ద్వేషం, అసూయ ఉండవు. స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పు ఒప్పులను లెక్కిస్తూ కోపం ప్రదర్శించదు. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

IIT బెనారస్‌లో ఉద్యోగాలు

image

ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ 5 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MTech/PhD, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నోడల్ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ ఇంజినీర్‌కు రూ.75K, డిజైన్ ఇంజినీర్‌కు రూ.55K, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.45K చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iitbhu.ac.in

News March 19, 2026

ఉగాది: ఏ చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది?

image

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్‌ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..

News March 19, 2026

కుందేళ్ల పెంపకానికి మేలైన జాతులు

image

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.