News August 27, 2024
హార్దిక్ పాండ్యతో విడాకుల తర్వాత ప్రేమపై నటాషా పోస్ట్
క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిక్ కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాలో ఉంటున్నారు. తాజాగా ఆమె ప్రేమ గురించి ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. లవ్‌లో ద్వేషం, అసూయ ఉండవు. స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పు ఒప్పులను లెక్కిస్తూ కోపం ప్రదర్శించదు. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.
Similar News
News December 13, 2024
బాలికపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
TG: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
News December 13, 2024
హత్యాయత్నం కేసు.. మోహన్‌బాబు ఇంటికి పోలీసులు
జల్‌పల్లిలోని నటుడు మోహన్‌బాబు ఇంటికి కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లనున్నారు. రిపోర్టర్‌పై హత్యాయత్నం కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. మోహన్‌బాబు వెపన్‌ను సీజ్ చేయనున్నారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.
News December 13, 2024
కంటి ఆరోగ్యానికి ‘అమ్మ’ వంటిది.. ఉసిరి
మొబైల్, కంప్యూటర్‌ను విపరీతంగా చూడటం వల్ల నేత్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఉసిరితో వీటిని తగ్గించుకోవచ్చని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇందులోని విటమిన్-సి కంట్లో ఆక్సిడేషన్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫ్రీ ర్యాడికల్స్ నుంచి కణాలను కాపాడతాయి. కంటి అలసట, పొడిబారడం, చిరాకు, మసక చూపుకు విటమిన్-ఏ చెక్ పెడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో కంటి నొప్పి, ఎర్రబారడం తగ్గుతాయి.