News August 28, 2024

త్వరలో హైడ్రా చట్టం: కమిషనర్ రంగనాథ్

image

TG: HYDRA పేరిట ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. అమల్లోకి వచ్చాక త్వరలోనే హైడ్రా పేరిట స్వయంగా నోటీసులు ఇస్తామన్నారు. హైడ్రా పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు తమ విచారణలో తేలిన అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Similar News

News March 31, 2026

ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు అందజేత

image

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు 6 ట్రైసైకిళ్లు, 2 వీల్‌చైర్లు, 4 వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలు వారి దైనందిన జీవనంలో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News March 31, 2026

నేతల ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే..

image

ఎన్నికల ప్రచారంలో నేతలు అంత ఎనర్జీతో ఎలా ఉంటారో తెలుసా? మోదీ 5 గంటలకే నిద్రలేచి యోగా చేస్తారు. ఆయనకు కిచిడీ అంటే ఇష్టం. రాహుల్ గాంధీ ‘ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్. ప్రొటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇక TN CM స్టాలిన్ సైక్లింగ్‌తో ఫిట్‌గా ఉంటారు. వీళ్లంతా డీహైడ్రేషన్ కాకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగపై ఆధారపడతారు. హెల్తీ డైట్, రెగ్యులర్ వాకింగ్ వల్లే వీళ్లు యాక్టివ్‌గా ఉండగలుగుతున్నారు.

News March 31, 2026

జూనియర్ కాలేజీలకు సెలవులే సెలవులు

image

AP:ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో 2026-27లో APR-MAR వరకు 314 రోజులకు గాను 232 వర్కింగ్ డేస్‌గా చూపింది. ఇక సండే, 2వ శనివారాలు, పబ్లిక్ హాలిడేస్, పండగలకు 82 రోజులు సెలవుగా పేర్కొంది. OCTలో దసరాతో సహా 14 రోజులు, JANలో సంక్రాంతితో కలిపి 13 రోజులు సెలవు ఇస్తారు. వీటికి అదనంగా ఏటా APR24 నుంచి MAY31 వరకు 38 రోజులు సమ్మర్ సెలవులుంటాయి. మొత్తంగా 120 రోజులు సెలవులే.