News August 28, 2024
త్వరలో హైడ్రా చట్టం: కమిషనర్ రంగనాథ్
TG: HYDRA పేరిట ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. అమల్లోకి వచ్చాక త్వరలోనే హైడ్రా పేరిట స్వయంగా నోటీసులు ఇస్తామన్నారు. హైడ్రా పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు తమ విచారణలో తేలిన అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
Similar News
News September 14, 2024
ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష.. ఇంటర్నెట్ నిలిపివేత!
అస్సాంలో గ్రేడ్-3 ప్రభుత్వ ఉద్యోగాలకు రేపు ఉ.10 గంటల నుంచి మ.1:30 గంటల వరకు నియామక పరీక్ష జరగనుంది. దీంతో పరీక్ష జరిగే సమయంలో అన్ని ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిలిపివేయనుంది. 28 జిల్లాల్లో 2,305 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మోసానికి పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలోనూ పరీక్షల సమయంలో ప్రభుత్వం ఇలానే ఇంటర్నెట్ నిలిపివేసింది.
News September 14, 2024
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పు వదిలేయాలా?
ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని కొందరి విశ్వాసం. అందుకే దీంతో దిష్టి తీస్తారు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పును వదిలేసి వెళితే మనలోని నెగటివ్ ఎనర్జీ పోతుందనీ నమ్ముతుంటారు. అయితే అలా చేయడం సరి కాదని పండితులు చెబుతున్నారు. ఉండటానికి నీడనిచ్చిన వారి ఇంట్లో ఉప్పు వదిలేసి వారికి హాని చేసే ఆలోచన మంచిది కాదంటున్నారు. కావాలంటే ఉప్పును నీళ్లలో వేయాలంటున్నారు. కరిగాక ఎక్కడైనా పోయవచ్చని చెబుతున్నారు.
News September 14, 2024
ముగిసిన వైసీపీ నేతల విచారణ
AP: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ ముగిసింది. జోగి రమేశ్, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంను మంగళగిరి పోలీసులు విచారించారు. కాసేపటి క్రితం వారు పీఎస్ నుంచి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించారు.