News August 28, 2024
Stock Market: కన్సాలిడేషన్ దశలోకి సూచీలు

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించాయి. 81,779 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 81,721 వద్ద కొనసాగుతోంది. 25,030 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 25,009 వద్ద చలిస్తోంది. LTI మైండ్‌ట్రీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, BPCL, M&M, విప్రో టాప్ గెయినర్స్. FIIలు కొనుగోళ్లు చేపట్టడంతో DIIలు లాభాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <