News August 28, 2024

Stock Market: కన్సాలిడేషన్ దశలోకి సూచీలు

image

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించాయి. 81,779 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 81,721 వద్ద కొనసాగుతోంది. 25,030 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 25,009 వద్ద చలిస్తోంది. LTI మైండ్‌ట్రీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, BPCL, M&M, విప్రో టాప్ గెయినర్స్. FIIలు కొనుగోళ్లు చేపట్టడంతో DIIలు లాభాలు స్వీకరిస్తున్నారు.

Similar News

News February 8, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్(ISSA) 21 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech(CS), డిప్లొమా(CS), MSc(మ్యాథ్స్), అర్హతగల వారు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను hrd.issa@gov.inకు ఈ -మెయిల్ చేయాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News February 8, 2026

SRK ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ‘కింగ్’ తర్వాత రెండేళ్లు సెలవు?

image

షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కి ఇది కొంచెం షాకింగ్ న్యూసే. అప్ కమింగ్ మూవీ ‘కింగ్’ రిలీజ్ తర్వాత ఆయన రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. వరుస షూటింగ్స్, స్టంట్స్ వల్ల భుజం గాయంతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతుండటమే దీనికి కారణం. బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి హెల్త్ సెట్ చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘కింగ్’ తర్వాత స్క్రీన్‌పై SRKని చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

News February 8, 2026

గందరగోళంలో ఉన్నారా? ఈ ప్రాచీన ట్రిక్ ట్రై చేయండి!

image

ఇతరుల సమస్యలకు గొప్ప సలహాలు ఇచ్చే మనం.. మన విషయంలో మాత్రం తడబడతాం. దీన్నే ‘సోలమన్ పారడాక్స్’ అంటారు. దీనికి చెక్ పెట్టేదే ‘ఇల్లీయిజం’. అంటే మీ గురించి మీరు ‘నేను’ అనకుండా మీ పేరుతో మాట్లాడుకోవడం. Ex ‘నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?’ అని కాకుండా ‘రాజు (మీ పేరు) ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి?’ అని ఆలోచించడం. ఇలా చేస్తే ఎమోషన్స్ పక్కకు జరిగి తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.