News August 28, 2024

అసత్యాల ప్రచారానికి AI వాడుతున్న BJP: మమత

image

అవాస్తవాల ప్రచారానికి బీజేపీ AIని వాడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఏఐ సాయంతో భారీ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతికి అదే కారణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉండుంటే వైద్యురాలి హత్యాచార కేసు నిందితుడికి 7 రోజుల్లో మరణశిక్ష విధించేవాళ్లం అన్నారు. ఏదేమైనా అతడికి శిక్షపడేలా ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. Jr వైద్యులపై చర్యలేమీ ఉండవని హామీ ఇచ్చారు.

Similar News

News July 9, 2025

HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ <<16524630>>రిపోర్టు<<>> ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.

News July 9, 2025

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

image

TG: తమ రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేంద్ర ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ‘తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కాస్త యూరియా వాడకం తగ్గిస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

News July 9, 2025

BRS వల్లే కృష్ణా జలాల్లో TGకి అన్యాయం: మంత్రి ఉత్తమ్

image

TG: BRS హయాంలోనే రాయలసీమకు కృష్ణా నీటిని అక్రమంగా తరలించే ఏర్పాట్లు జరిగాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను BRS పూర్తి చేయలేదు. కృష్ణా జలాల్లో TGకి 299 TMCలు చాలని KCR ఒప్పుకున్నారు. APకి 512 TMCలు ఇచ్చేందుకు అంగీకరించారు. మా ప్రభుత్వం వచ్చాకే TGకి 578 TMCలు కావాలని అపెక్స్ కౌన్సిల్‌ను కోరాం’ అని కృష్ణా జలాలపై ప్రజెంటేషన్‌లో వివరించారు.