News August 28, 2024
అసత్యాల ప్రచారానికి AI వాడుతున్న BJP: మమత
అవాస్తవాల ప్రచారానికి బీజేపీ AIని వాడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఏఐ సాయంతో భారీ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతికి అదే కారణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉండుంటే వైద్యురాలి హత్యాచార కేసు నిందితుడికి 7 రోజుల్లో మరణశిక్ష విధించేవాళ్లం అన్నారు. ఏదేమైనా అతడికి శిక్షపడేలా ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. Jr వైద్యులపై చర్యలేమీ ఉండవని హామీ ఇచ్చారు.
Similar News
News September 18, 2024
దివాలా దిశగా ‘టప్పర్‌వేర్’
ప్లాస్టిక్ బాక్సుల తయారీలో దిగ్గజ సంస్థ టప్పర్‌వేర్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ వారంలోనే దివాలా ప్రకటన చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. కంపెనీ షేర్లు తాజాగా 57 శాతం పడిపోయాయి. 2019లో 40 డాలర్లకుపైగా ఉన్న షేర్ విలువ ప్రస్తుతం 0.51 డాలర్లకు పడిపోయింది. $700 మిలియన్లకుపైగా ఉన్న అప్పులను చెల్లించడం సాధ్యం కావట్లేదు. దీంతో రుణదాతలతో చర్చించి దివాలా ప్రకటించడానికి సన్నాహాలు చేసుకుంటోంది.
News September 18, 2024
SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్
TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్‌గా రిటైర్డ్ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్‌ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.
News September 18, 2024
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది. పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను సీఎం వెల్లడించనున్నారు.