News August 29, 2024
ఏపీలో మరో ఘోరం

AP: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోవెలకుంట్లలో మతిస్తిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 24న ఆమెకు మాయమాటలు చెప్పి పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి, అత్యాచారం చేస్తూ వీడియోలు, ఫొటోలు తీసి రాక్షసానందం పొందారు. వారి స్నేహితుల ఫోన్లలో ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో విషయం బయటకొచ్చింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News November 5, 2025
ట్రంప్ పార్టీ ఓటమి

అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్‌కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్‌కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.
News November 5, 2025
సంతానలేమిని నివారించే ఖర్జూరం

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.
News November 5, 2025
SSC-కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఫలితాలు రిలీజ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


