News August 29, 2024
ఏపీలో మరో ఘోరం

AP: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోవెలకుంట్లలో మతిస్తిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 24న ఆమెకు మాయమాటలు చెప్పి పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి, అత్యాచారం చేస్తూ వీడియోలు, ఫొటోలు తీసి రాక్షసానందం పొందారు. వారి స్నేహితుల ఫోన్లలో ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో విషయం బయటకొచ్చింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News February 18, 2025
భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్‌లో విండీస్‌పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్‌పై ఈ స్కోర్లు చేశారు.
News February 18, 2025
BREAKING: టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు డబ్బులు చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ <
News February 18, 2025
Stock Markets: ఐటీ తప్ప అన్నీ…

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ 22,917 (-40), సెన్సెక్స్ 75,920 (-70) వద్ద చలిస్తున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పటికే ఓవర్‌సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో కౌంటర్ ర్యాలీకి అవకాశం ఉంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్.