News August 29, 2024

నాని ‘సరిపోదా శనివారం’ రివ్యూ-రేటింగ్

image

అమ్మకు ఇచ్చిన మాట కోసం కథానాయకుడు శనివారం ఏం చేశాడనేదే మూవీ స్టోరీ. క్లాస్ హీరోగా ముద్రపడ్డ నాని ప్యూర్ మాస్ యాక్షన్‌‌తో అదరగొట్టారు. సైకో పోలీస్ పాత్రలో SJ సూర్య నటన వేరే లెవెల్. నాని-సూర్య మధ్య యాక్షన్ సీన్లు హైలైట్. ట్విస్ట్‌లు, బీజీఎం ఆకట్టుకుంటాయి. అయితే మూవీ లెంగ్త్, సాగదీత, ఊహించే సీన్లు ఇబ్బంది పెడతాయి. స్క్రీన్ ప్లేపై దర్శకుడు వివేక్ ఆత్రేయ మరింత దృష్టి పెట్టాల్సింది.
రేటింగ్-2.75/5

Similar News

News July 6, 2025

PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

image

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News July 6, 2025

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

image

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <>నోటిఫికేషన్ <<>>విడుదలైంది. పెళ్లి కాని, టెన్త్ పూర్తైన యువతి, యువకులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అభ్యర్థులు 1-09-2004 నుంచి 29-02-2008 మధ్య జన్మించి ఉండాలి. మ్యూజిక్‌కు సంబంధించిన పలు విభాగాలపై పట్టు ఉండాలి. జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫిట్‌నెస్, మ్యూజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆగస్టు/SEPలోగా నియామకం పూర్తవుతుంది.

News July 6, 2025

సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

image

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.