News August 29, 2024
నాని ‘సరిపోదా శనివారం’ రివ్యూ-రేటింగ్

అమ్మకు ఇచ్చిన మాట కోసం కథానాయకుడు శనివారం ఏం చేశాడనేదే మూవీ స్టోరీ. క్లాస్ హీరోగా ముద్రపడ్డ నాని ప్యూర్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టారు. సైకో పోలీస్ పాత్రలో SJ సూర్య నటన వేరే లెవెల్. నాని-సూర్య మధ్య యాక్షన్ సీన్లు హైలైట్. ట్విస్ట్‌లు, బీజీఎం ఆకట్టుకుంటాయి. అయితే మూవీ లెంగ్త్, సాగదీత, ఊహించే సీన్లు ఇబ్బంది పెడతాయి. స్క్రీన్ ప్లేపై దర్శకుడు వివేక్ ఆత్రేయ మరింత దృష్టి పెట్టాల్సింది.
రేటింగ్-2.75/5
Similar News
News July 10, 2025
GPO రెండో విడత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TG: గ్రామ పాలన అధికారుల(GPO) భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. 10,954 పోస్టుల భర్తీకి మార్చి 29న మొదటి నోటిఫికేషన్ రాగా 3,550 మంది ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ గతంలో వీఆర్ఏ, వీఆర్వోలుగా చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 16లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న GPO పరీక్ష నిర్వహించనున్నారు.
News July 10, 2025
BREAKING: ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. 15 సెకన్లపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
News July 10, 2025
ఛంగూర్ బాబా: సైకిల్ నుంచి రూ.100 కోట్ల ఆస్తి!

UPలో అనధికార మత మార్పిడులకు పాల్పడుతున్న ఛంగూర్ బాబా కేసు వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడికి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నట్లు, 40 బ్యాంకు ఖాతాలు, రూ.106 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాబా గతంలో సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయిత్తులు అమ్ముకునేవాడు. అతడు బలరాంపూర్(D) రెహ్రా మాఫీలో ఓ భారీ భవనం నిర్మించుకోగా యోగి సర్కార్ బుల్డోజర్లతో కూల్చివేసింది.