News August 29, 2024

నమీబియాలో కరవు.. ఏనుగుల మాంసం పంచనున్న ప్రభుత్వం

image

ఆఫ్రికాలోని నమీబియాలో తీవ్ర కరవు నెలకొంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 723 అరుదైన అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని ప్రజలకు అందించాలని భావించింది. 300 జీబ్రాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 83 ఏనుగులు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 30 నీటి గుర్రాలను వధించనున్నారు. కాగా నమీబియాలో 14 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వ అంచనా.

Similar News

News September 15, 2025

వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

image

* <<17714335>>వక్ఫ్<<>> భూముల ఆక్రమణపై కలెక్టర్‌దే తుది నిర్ణయమన్న ప్రొవిజన్‌‌పై SC స్టే విధించింది. ట్రిబ్యునల్/కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలంది.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల సంఖ్య 4, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 3కు మించొద్దని చెప్పింది.
* స్టేట్ బోర్డుకు నాన్-ముస్లిం CEO కావొచ్చన్న ప్రొవిజన్‌పై స్టే విధించలేదు. కానీ వీలైనంత వరకు ముస్లింనే నియమించాలంది.
* రిజిస్ట్రేషన్‌ రూల్‌లో కోర్టు జోక్యం చేసుకోలేదు.

News September 15, 2025

‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

image

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.

News September 15, 2025

రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

image

TG: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్‌కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.