News August 29, 2024
నమీబియాలో కరవు.. ఏనుగుల మాంసం పంచనున్న ప్రభుత్వం
ఆఫ్రికాలోని నమీబియాలో తీవ్ర కరవు నెలకొంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 723 అరుదైన అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని ప్రజలకు అందించాలని భావించింది. 300 జీబ్రాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 83 ఏనుగులు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 30 నీటి గుర్రాలను వధించనున్నారు. కాగా నమీబియాలో 14 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వ అంచనా.
Similar News
News September 10, 2024
ఏపీలో రూ.6,882 కోట్ల నష్టం!
AP: ప్రాథమిక అంచనా ప్రకారం వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.6,882కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యుమరేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు మొత్తం 46 మంది ప్రజలు, 540 పశువులు మృతిచెందినట్లు గుర్తించింది. 4.90 లక్షల ఎకరాల్లో పంట నష్టం, 5,921kms మేర రోడ్లు ధ్వంసమైనట్లు పేర్కొంది.
News September 10, 2024
సల్మాన్-రష్మిక మూవీలో కాజల్ అగర్వాల్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘సికందర్’లో కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఏ రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. AR మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
News September 10, 2024
సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనాలి: సీఎం
AP: విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు సాధారణ స్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అక్కడి ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆ ప్రాంత మంత్రులకు సూచించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75లక్షల మందికి సహాయక చర్యలు అందించాలన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు.