News August 30, 2024

అది గంభీర్ జట్టే: LSG ఓనర్ ప్రశంస

image

అతి తక్కువ సమయంలోనే గౌతమ్ గంభీర్ అద్భుతమైన జట్టును నిర్మించారని LSG ఓనర్ సంజీవ్ గోయెంకా అన్నారు. ఐపీఎల్ 2021 వేలానికి 2 వారాల ముందే ఫ్రాంచైజీ తమచేతికి వచ్చిందని పేర్కొన్నారు. ‘మా జట్టుకు పునాది వేయడంలో గంభీర్‌దే కీలక పాత్ర. మొదటి వేలంలో మేం విజయవంతం అయ్యామంటే అతడే కారణం. అప్పుడు మాకు రీసెర్చ్, అనలిస్టుల టీమ్ లేదు. దాంతో గౌతీయే ఆటగాళ్లను ఎంపికచేసి సమతూకమైన జట్టును నిర్మించారు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 15, 2025

BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట

image

AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.

News January 15, 2025

గేమ్ ఛేంజర్ NETT కలెక్షన్స్ ఎంతంటే?

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా 5 రోజుల్లో ₹100కోట్ల NETT కలెక్షన్స్ సాధించినట్లు ఇండియా టుడే తెలిపింది. తొలి రోజు ₹51కోట్లు, తర్వాతి 4 రోజుల్లో వరుసగా ₹21.6కోట్లు, ₹15.9కోట్లు, ₹7.65కోట్లు, ₹10 కోట్లు వసూలు చేసిందని పేర్కొంది. మొత్తం <<15125676>>NETT<<>> వసూళ్లు ₹106.15 అని పేర్కొంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 10న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

News January 15, 2025

BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్

image

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.