News August 30, 2024

అది గంభీర్ జట్టే: LSG ఓనర్ ప్రశంస

image

అతి తక్కువ సమయంలోనే గౌతమ్ గంభీర్ అద్భుతమైన జట్టును నిర్మించారని LSG ఓనర్ సంజీవ్ గోయెంకా అన్నారు. ఐపీఎల్ 2021 వేలానికి 2 వారాల ముందే ఫ్రాంచైజీ తమచేతికి వచ్చిందని పేర్కొన్నారు. ‘మా జట్టుకు పునాది వేయడంలో గంభీర్‌దే కీలక పాత్ర. మొదటి వేలంలో మేం విజయవంతం అయ్యామంటే అతడే కారణం. అప్పుడు మాకు రీసెర్చ్, అనలిస్టుల టీమ్ లేదు. దాంతో గౌతీయే ఆటగాళ్లను ఎంపికచేసి సమతూకమైన జట్టును నిర్మించారు’ అని పేర్కొన్నారు.

Similar News

News September 13, 2024

పోర్ట్ బ్లెయిర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..

image

అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌ను<<14093820>> కేంద్రం శ్రీవిజయపురంగా మార్చిన<<>> సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం ఈ దీవుల్లో కాలనీలను ప్రారంభించాలని భావించింది. దానికోసం ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే అధికారిని 1788లో తమ ప్రతినిధిగా నియమించింది. బ్రిటన్ సిబ్బంది, సేవకులతో కలిసి ఆయన ఇక్కడ నివసించేవారు. కాలక్రమంలో అతడి పేరునే రాజధానికి పోర్ట్ బ్లెయిర్‌గా పెట్టారు.

News September 13, 2024

ఫేమస్ బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి

image

‘ప్రపంచ భయంకరమైన బాడీబిల్డర్’గా పేరొందిన ఇలియా గోలెం(36) హార్ట్‌ఎటాక్‌తో కన్నుమూశారు. ఈనెల 6న గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ 11న ప్రాణాలు కోల్పోయారు. బెలారస్‌కు చెందిన ఈ బాడీబిల్డర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ‘ది మ్యుటాంట్’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకుంటారు. 154 కేజీల బరువున్న అతడి ఎత్తు 6.1 అడుగులు. చెస్ట్ 61 అంగుళాలు కాగా బైసెప్స్ 25 ఇంచులు ఉండటం విశేషం.

News September 13, 2024

అండమాన్ దీవులకు ఆ పేరెలా వచ్చిందంటే..!

image

అండమాన్‌ దీవులకు మలయ్ జాతి ప్రజలు ఆ పేరును పెట్టినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇండోనేషియాకు చెందిన మలయ్‌ జాతి ప్రజలు అండమాన్ గిరిజనుల్ని బంధించి బానిసలుగా విక్రయించేవారు. రామాయణంలోని హనుమాన్ పేరు మీదుగా దీవుల్ని మలయ్‌ ప్రజలు హండుమాన్‌గా పిలిచేవారు. కాలక్రమంలో అదే అండమాన్ అయిందని ఓ కథనం.