News August 30, 2024

BREAKING: వైసీపీకి మరో బిగ్ షాక్

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్‌కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే.

Similar News

News January 17, 2026

నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదు: కైఫ్

image

NZతో ODI సిరీస్‌లో IND పిచ్‌కి తగ్గట్టు ప్లేయింగ్-11ని ఎంపిక చేయట్లేదని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. జట్టులో నితీశ్ రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన YouTube వీడియోలో చెప్పుకొచ్చారు. ‘నితీశ్ ఆల్‌రౌండర్ కాదు. అతను బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని మేనేజ్‌మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అతడిని బ్యాటర్‌గా డెవలప్ చేయాలి. పార్ట్ టైమ్ బౌలర్‌ను ఆల్‌రౌండర్ అనడం కరెక్ట్ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

News January 17, 2026

రానున్న 5 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని పేర్కొంది. అటు రాష్ట్రంలో నిన్నటి వరకు చలి తీవ్రత తగ్గినట్లు కనిపించగా ఇవాళ పెరిగింది. మరోవైపు ఫిబ్రవరి తొలి వారం నుంచి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 17, 2026

కొరియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..

image

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్‌ ఆహారాలు, తగిన నిద్ర, నీరు తీసుకోవడం, సన్ స్క్రీన్ ఎక్కువగా వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.