News August 30, 2024

BREAKING: వైసీపీకి మరో బిగ్ షాక్

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్‌కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే.

Similar News

News September 11, 2024

BAD LUCK: మూడో రోజూ ఆట రద్దు

image

గ్రేటర్ నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే తొలి రెండు రోజుల ఆట రద్దవగా, వర్షం కారణంగా నేడు జరగాల్సిన ఆటను కూడా అంపైర్లు రద్దు చేశారు. ఈ విషయం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ప్లేయర్లనూ నిరాశలోకి నెట్టింది. రేపైనా పరిస్థితులు అనుకూలించి మ్యాచ్ జరగాలని క్రీడా వర్గాలు కోరుకుంటున్నాయి.

News September 11, 2024

తిరుమలలో అన్న ప్రసాద నాణ్యత మెరుగుపడిందంటున్న భక్తులు!

image

AP: తిరుమలలో అన్న ప్రసాద నాణ్యతపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ చర్యలకు దిగింది. క్యాంటీన్లలో తనిఖీలు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఆదేశించింది. టీటీడీ చర్యలతో ప్రస్తుతం తిరుమల అన్న ప్రసాదం క్వాలిటీ చాలా మెరుగైందని భక్తులు పోస్టులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు తిరుమలకు వెళ్లారా? అన్న ప్రసాద నాణ్యతపై మీ కామెంట్?

News September 11, 2024

తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్

image

టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా తల్లి కాబోతున్నారు. ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా హంట్, పులి, నేను శైలజ, సిల్లీ ఫెలోస్, రంగులరాట్నం, అహో విక్రమార్క చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ను చిత్రా వివాహం చేసుకున్నారు.