News August 30, 2024
నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ

రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా 2029లో కూడా గెలిచి నాలుగోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఆయన మాట్లాడుతూ కొందరు రాజకీయ విశ్లేషకులు ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మోజారిటీ సాధించలేదని, దాంతో తాను ప్రజాదరణ కోల్పోయానని చెబుతున్నారని అన్నారు. 2029లో జరిగే ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు కూడా తానే వస్తానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News January 24, 2026
రథ సప్తమి రోజున ‘7’ అంకె ప్రాముఖ్యత

ప్రకృతిలో 7 అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. సప్త స్వరాలు, వారాలు, రుషులు, 7 కొండలే కాకుండా సూర్యుడి తొలి 7 కిరణాలు కూడా అంతే ముఖ్యమైనవి. అవి: సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాణ్. ఈ ఏడు కిరణాలు ఏడు రంగులకు (VIBGYOR) మూలమని చెబుతారు. ఇవి విశ్వమంతా శక్తిని, ఆరోగ్యాన్ని నింపుతాయని శాస్త్ర వచనం. సూర్యుని రథానికి ఉండే ఏడు గుర్రాలు కూడా ఈ కిరణాలలోని అద్భుత శక్తికి సంకేతాలే.
News January 24, 2026
600 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు స్థానిక భాషపై పట్టున్న వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofmaharashtra.bank.in/careers
News January 24, 2026
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. <


