News August 31, 2024
త్వరలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు!

AP: పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని గనులశాఖ చీఫ్ సెక్రటరీ ముకేశ్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ విధానం అమలుపై జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక లభ్యత, ధరలపై కలెక్టర్లు నిత్యం బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారాలకు జేసీలు బాధ్యులుగా ఉంటారని, వినియోగదారులు 100శాతం సంతృప్తి వ్యక్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 13, 2026
భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

TG: వేసవిలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి అది 2.50 లక్షల కేసులకు పెరగొచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు అన్ని బ్రూవరీలకు లక్ష్యాలను నిర్దేశించింది. కాగా ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను సందర్శించి బీర్, ఇతర మద్యం ఉత్పత్తిపై సూచనలు ఇచ్చారు.
News January 13, 2026
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

<
News January 13, 2026
కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్

TG: జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై BRS స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.


