News August 31, 2024
త్వరలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు!

AP: పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని గనులశాఖ చీఫ్ సెక్రటరీ ముకేశ్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ విధానం అమలుపై జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక లభ్యత, ధరలపై కలెక్టర్లు నిత్యం బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారాలకు జేసీలు బాధ్యులుగా ఉంటారని, వినియోగదారులు 100శాతం సంతృప్తి వ్యక్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 14, 2025
IPL ఫ్యాన్స్‌కు షాక్!

జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా <<15456249>>ఏర్పడిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే IPL కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘జియో హాట్‌స్టార్’ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘హిందూస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దీనికి 3 నెలలకు రూ.149 చెల్లించాల్సి ఉంటుంది. Ad Free ఆప్షన్ కోసం రూ.499 వెచ్చించాలి. MAR 22 నుంచి IPL ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News February 14, 2025
స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి: శ్రీనివాస వర్మ

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పునరుద్ఘాటించారు. కొన్ని కారణాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.11,400కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. CM CBN, మంత్రి లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
News February 14, 2025
ఘోరం: యువకుడిని చంపి ముక్కలుగా చేసి..

AP: రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.