News August 31, 2024
GOOD NEWS: కాసేపట్లో పింఛన్ల పంపిణీ

AP: రాష్ట్రంలో ఒక రోజు ముందుగా నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు నగదు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి రూ.2,730 కోట్ల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి అందించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Similar News
News March 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 14, 2025
బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్‌లో నమోదైన కేసుల్లో అనిల్‌కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
News March 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.