News August 31, 2024
GOOD NEWS: కాసేపట్లో పింఛన్ల పంపిణీ

AP: రాష్ట్రంలో ఒక రోజు ముందుగా నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు నగదు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి రూ.2,730 కోట్ల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి అందించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Similar News
News February 19, 2025
విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
News February 19, 2025
CHAMPIONS TROPHY: 12 వేల మందితో భారీ భద్రత!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పీసీబీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం 9 స్పెషల్ చార్టర్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి.
News February 19, 2025
శివాజీ జయంతికి రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి..

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జయంతి వేళ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాయడమే ఇందుకు కారణం. సాధారణంగా వర్ధంతులకే ఇలా చెప్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ శివాజీ విగ్రహాలను తీసుకొనేందుకు ఆయన వెనుకాడటం, నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు యూజర్లు గుర్తుచేస్తున్నారు.