News August 31, 2024
మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇవి తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్ కోయిల్, మధురై-బెంగళూరు, యూపీలోని మీరట్-లక్నో మధ్య నడవనున్నాయి. ఇందులో రెండు రైళ్లు దక్షిణ రైల్వే జోన్‌లోనివి కావడం విశేషం.
Similar News
News January 17, 2026
ఇరాన్ నుంచి వెెనుదిరుగుతున్న భారతీయులు

అంతర్గత నిరసనలు, మరోపక్క USతో యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. ఆ దేశంలో 9000 మంది భారతీయులుండగా వీరిలో విద్యాభ్యాసం కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. కమర్షియల్ విమానాలు ప్రస్తుతం తిరుగుతున్నందున ఇరాన్ వీడి వెళ్లడం మంచిదని సూచించింది.
News January 17, 2026
యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

TG: రాష్ట్రంలో పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్(నాన్ క్యాడర్)ను నియమించింది. మొన్నటి వరకు ఈవోగా ఉన్న వెంకట్రావు అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. ఇక ఆసిఫాబాద్ కలెక్టర్‌గా కె.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కె.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్ ధోత్రేను సర్కార్ బదిలీ చేసింది.
News January 17, 2026
ఇండిగో సంక్షోభం.. భారీ జరిమానా విధించిన DGCA

వందల <<18481260>>విమానాల రద్దు<<>>, వాయిదాలతో ప్రయాణికులను ఇండిగో ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో కొన్ని రోజులపాటు కొనసాగిన ఈ సంక్షోభంపై DGCA ఇవాళ చర్యలు తీసుకుంది. ఇండిగోకు రూ.22.2 కోట్ల జరిమానా విధించింది. అలాగే రూ.50 కోట్ల బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని ఆదేశించింది. రాబోయే నెలల్లో తనిఖీలు చేసి దశలవారీగా ఆ డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇంప్రూవ్‌మెంట్ చూపించాలని స్పష్టం చేసింది.


